శృతి హాసన్ మైండ్ లో ఏం నడుస్తుంది..?

Saturday,February 23,2019 - 10:03 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ తరవాత మళ్ళీ సినిమా చేయలేదు శృతి హాసన్. పోనీ ఇతర భాషల్లో బిజీగా ఉందా అంటే అదీ లేదు. క్రేజ్ తగ్గింది కాబట్టి సినిమా అవకాశాలు రావట్లేదు అని మరీ అంత ఈజీగా కొట్టేయడానికి కూడా లేదు. ‘కాటమరాయుడు’ తరవాత శృతికి అవకాశాలు రాకపోవడమా…? అస్సలు సింక్ అవ్వదు…

కమల హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తుంది శృతి హాసన్. కానీ ఈ సినిమా ఎక్స్ పెక్ట్ చేసిన స్పీడ్ లో తెరకెక్కుతున్నట్టు గాని, ఇప్పుడప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే సూచనలైతే కనిపించట్లేదు. అందుకే ఫోకస్ శృతి హాసన్ పై మళ్ళుతుంది.

ఇప్పటి వరకు ఎక్కడా సినిమాలు చేయనని అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు శృతి హాసన్. కొద్దో గొప్పో సోషల్ మీడియాలో కనిపిస్తుందంటే వరసగా చేస్తున్న మీడియా కన్సర్ట్స్ వల్లే. అంటే.. ఇకపై శృతి కంప్లీట్ గా సింగర్ గానే సెటిల్ అవుదామనుకుంటుందా..? అసలు శృతి మైండ్ లో ఏం నడుస్తుంది..?

బేసిగ్గా మల్టీ ట్యాలెంటెడ్. బాలీవుడ్ లో సింగర్ గా మంచి క్రేజ్ ఉంది. బిగినింగ్ నుండి యాక్టింగ్ పట్ల ఎంత ప్యాషనేట్ గా ఉందో, సింగింగ్ పట్ల అంతే సీరియస్ గా ఉంది. అయితే ఈ గ్యాప్ చూస్తుంటే శృతి కంప్లీట్ ఫోకస్ జస్ట్ సింగింగ్ పై పెట్టినట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం శృతిని మళ్ళీ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.