ఎన్టీఆర్-మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్

Saturday,February 23,2019 - 11:54 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ లో చివరిదైన మహానాయకుడు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ గా బాలయ్య నటించిన ఈ సినిమా మొదటి రోజు తక్కువ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహానాయకుడు సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 40 లక్షలు
సీడెడ్ – రూ. 20 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 లక్షలు
ఈస్ట్ – రూ. 10 లక్షలు
వెస్ట్ – రూ. 10 లక్షలు
గుంటూరు – రూ. 51 లక్షలు
నెల్లూరు – రూ. 5 లక్షలు
కృష్ణా – రూ. 14 లక్షలు