కార్తికేయ - టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

Saturday,April 27,2019 - 01:27 by Z_CLU

జస్ట్ ఒక్క సినిమాతోనే సక్సెస్ కొట్టాడు కార్తికేయ. Rx100 తో యూత్ లో కావాల్సినంత క్రేజ్ క్రియేట్ అయింది. అయితే నెక్స్ట్ ఏంటి..? ఫస్ట్ సినిమాతో బోల్డ్ అటెంప్ట్ చేసిన ఈ హీరో, ఇకపై అదే క్రేజ్ ని నిలుపుకోగలడా..? నిజానికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రెండో సినిమా రిలీజైతే దొరకాలి. కానీ కార్తికేయ జస్ట్ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

హిప్పీ : టైటిలే కొత్తగా ఉంది. దానికి తోడు ఈ సినిమాలో కార్తీకేయ లుక్స్ సినిమా డెఫినెట్ గా డిఫెరెంట్ గా ఉండబోతోందనే వైబ్స్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజయ్యే సరికి ఈ సినిమా Rx 100 లాగే సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ ఫిక్సయిపోయారు ఫాన్స్. సినిమా రిలీజ్ కి ముందే హాట్ టాపిక్ గా మారాడు.

గ్యాంగ్ లీడర్ : హీరోగా చేసింది జస్ట్ ఒక్క సినిమా… అంతలో విలన్ గా చేయడమన్నది బోల్డ్ డెసిషనే. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజు నాని కొత్త సినిమా అంటూ ఎంతగా డిస్కషన్స్ జరిగాయో, కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు అనేది కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.


గుణ 365 : నిన్న అనౌన్స్ అయింది ఈ సినిమా. ఈ సినిమా గురించి పెద్దగా రివీల్ కాలేదు కానీ రెగ్యులర్ సినిమా మాత్రం అస్సలు కాదని కన్ఫామ్ చేశాడు కార్తికేయ. దీంతో మరింతగా ఈ హీరోపై ఫోకస్ పడుతుంది.
నిజానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజైతే హీరోల పేరు ట్రెండ్ అవ్వాలి, కానీ కార్తికేయ మాత్రం డిఫెరెంట్ రోల్స్ ని ఎంచుకుంటూ ఫోకస్ లోకి వస్తున్నాడు. పక్కా కరియర్ ప్లానింగ్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాడు.