కార్తికేయ కొత్త రికార్డు

Tuesday,June 11,2019 - 03:01 by Z_CLU

సాధారణంగా ఒక్కో హీరో సంవత్సరానికి 2, 3 సినిమాలు చేస్తారు. ఎంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే హీరోలయినా ఒక్కో సినిమాకి మినిమం గ్యాప్ మెయిన్ టైన్ చేస్తారు. కానీ కార్తికేయ విషయంలో వేరు. ఓ రకంగా చెప్పాలంటే ఓ కొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ఈ హీరో.

రీసెంట్ గా ‘హిప్పీ’ రిలీజయింది. ఇప్పటికీ అక్కడక్కడా ఆ సినిమా ప్రమోషన్స్ తో బిజీగానే ఉన్నాడు కార్తికేయ. అయితే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమాతో రాబోతున్నాడు. అదే ‘గుణ 369’. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు కానీ ప్రస్తుతానికి జూలై 19 డేట్ లాక్ చేశారు.

ఇక ఆగష్టు లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఉంది. నాని సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 30 న థియేటర్స్ లోకి వస్తుంది.

RX100 తరవాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి కార్తికేయ టైమ్ తీసుకున్నాడేమో కానీ, ఇప్పుడు వరస సినిమాలతో ఆడియెన్స్ కి మరింత దగ్గర కాబోతున్నాడు. నెలకు ఒక సినిమా రిలీజ్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.