షార్ట్ గ్యాప్ తర్వాత ఒకేసారి 2 సినిమాలు

Sunday,March 31,2019 - 12:30 by Z_CLU

కామెడీ సినిమాలతో కామెడీ హీరో ఇమేజ్ అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు. అందులో ఒకటి ‘మహర్షి’. ఈ సినిమాలో మహేష్ బాబు కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అలాగే నందిని నర్సింగ్ హోం డైరెక్టర్ తో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫినిషింగ్ స్టేజిలో ఉన్నాయి. కాకపోతే ముందుగా ‘మహర్షి ‘తోనే ప్రేక్షకుల ముందుకొస్తాడు అల్లరోడు .ఆ తర్వాత హీరోగా నటించిన సినిమా రిలీజ్ కానుంది.

అల్లరి నరేష్ మరో హీరో సినిమాలో క్యారెక్టర్ చేయడం కొత్తేం కాదు. గతంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్ చేసాడు. అయితే ‘మహర్షి’ మాత్రం నరేష్ కి స్పెషల్ మూవీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే నరేష్ కి కూడా పేరొస్తుంది. దాంతో మరిన్ని సినిమాలొచ్చే అవకాశం ఉంది. అలాగే హీరోగా నటిస్తున్న సినిమా కూడా హిట్ అయితే మళ్ళీ కామెడీ హీరోగా ఐయాం బ్యాక్ అనిపించుకుంటాడు. మరి ఈ రెండు సినిమాలతో అల్లరి నరేష్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆశిద్దాం.