RJ గా మారనున్న తమన్నా

Tuesday,August 29,2017 - 12:24 by Z_CLU

తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది తమన్నా. అద్మాన్ జయేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రేడియో జాకీగా నటించనుంది తమన్నా. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది తమన్నా. అల్టిమేట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉంది తమన్నా.

అటు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటు, తన మార్క్ గ్లామర్ రోల్స్ తో కరియర్ గ్రాఫ్ ని సక్సెస్ ఫుల్ గా మెయిన్ టైన్ చేస్తున్న తమన్నా ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనుందనే టాక్ టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయాల్సి ఉంది.