'రాజు గారి గది 2' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ...

Tuesday,August 29,2017 - 01:38 by Z_CLU

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజు గారి గది 2’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఓంకార్ దర్శకత్వం లో పివిపి సినిమాస్ బ్యానర్ పై హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ లోగో ను రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి నాగ్ ను విష్ చేశారు.

రుద్రాక్ష మాలతో పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్న నాగ్ ఈ ఫస్ట్ లుక్ తో అక్కినేని ఫాన్స్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ వారిలో ఫుల్ జోష్ నింపేశాడు. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 20న రిలీజ్ చేసి, సినిమాను అక్టోబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.