మరోసారి నిర్మాతగా నాని...ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ ...

Tuesday,August 29,2017 - 12:13 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సారి నిర్మాత అవతారమెత్తడానికి రెడీ అవుతున్నాడట. గతంలో ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాకు నిర్మాతగా భాగస్వామ్యం వహించిన నాని మళ్ళీ ఆ తర్వాత నిర్మాణం వైపు వెళ్ళలేదు.. అయితే ఎన్నో సందర్భాలలో నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలనుందని  తెలిపిన నాని ఇప్పుడు  ఆ దిశగా అడుగు లేస్తు న్నాడట.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ అనే షార్ట్ ఫిలిం మేకర్ దర్శకత్వంలో నాని నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని టాక్.. ఇటీవలే నిర్మాతగా ఎవరూ చేయలేని సినిమాలను నిర్మిస్తానని కొత్త కాన్సెప్ట్ తో నిర్మాతగా సినిమాలు చేస్తానని చెప్పిన నాని మరి ఈ సినిమాకు ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాడో…తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.