బాలకృష్ణ టైటిల్ తో అల్లరి నరేష్ మూవీ

Monday,December 10,2018 - 05:30 by Z_CLU

ప్ర‌స్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లరినరేష్. ఈ మూవీలో మహేష్ కు బెస్ట్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు ఈ సుడిగాడు. ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తను హీరోగా మరో సినిమా చేయబోతున్నాడు. ఆ మూవీకి బాలయ్య టైటిల్ ను కన్సిడర్ చేస్తున్నారు.

అనిల్ సుంకర నిర్మాతగా మరో సినిమా చేయడానికి అంగీకరించాడు అల్లరి నరేష్. గిరి ఈ సినిమాకు దర్శకుడు. గతంలో ఇతడు నందిని నర్సింగ్ హోం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు గతంలో బాలయ్య నటించిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారు.

బాలకృష్ణ కెరియ‌ర్‌లో బంగారు బుల్లోడు సూప‌ర్‌హిట్ మూవీ. అల్లరి నరేష్ సినిమాతో ఆ టైటిల్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో సుందరకాండ, యముడికి మొగుడు, ఆహ నా పెళ్లంట లాంటి హిట్ సినిమా టైటిల్స్ ను వాడేశాడు అల్లరోడు.