మెగా ఆరంభం.. సైరా టీజర్ పై ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Tuesday,August 21,2018 - 11:57 by Z_CLU

నిరీక్షణకు ఫలితం దక్కింది. మెగాభిమానుల దాహం కాస్త చల్లారింది. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా టీజర్ వచ్చేసింది. దీంతో మెగాస్టార్ పుట్టినరోజు సంబరాలు ఒక రోజు ముందే ప్రారంభమయ్యాయి. ఇక టీజర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్.

టీజర్ అంటే 30 సెకెన్లు ఉంటుంది. కొన్నిసార్లు హీరో ఎలివేషన్ కూడా ఉండదు. సైరా టీజర్ పై ఇలాంటి అనుమానాలు ఎన్నో. కానీ అభిమానులు, ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేయలేదు చిరంజీవి. సైరా టీజర్ లో చిరు లుక్ ను పూర్తిగా ప్రజెంట్ చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి మోస్ట్ ఎగ్రెసివ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇక గుర్రంపై స్వారీ చేస్తూ మెగాస్టార్ ఇచ్చిన ఎంట్రీ టోటల్ టీజర్ కే ది బెస్ట్. “ఈ యుద్ధం ఎవరిది” అంటూ చిరు చెప్పిన ఓ చిన్న డైలాగ్ కూడా టీజర్ లో ఉంది.

టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్ గా ఉండబోతోందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. సినిమా కోసం 14 భారీ సెట్స్ వేశారు. అందులో కొన్ని టీజర్ లో కనిపించాయి. గ్రాఫిక్స్ బాగున్నాయి. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్న, జగపతిబాబు లాంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.