సమరానికి సై అంటున్న సైరా

Tuesday,August 20,2019 - 03:30 by Z_CLU

సైరా నరసింహారెడ్డి హంగామా మొదలైంది. సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి టీజర్ గ్రాండ్ గా రిలీజైంది. దీని కోసం ఇన్నేళ్లు వెయిట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. అంత గ్రాండియర్ గా ఉంది సైరా టీజర్.

భారతదేశ తొలి స్వతంత్ర సమరయోధుని వీరగాధ ఇది. పైగా మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు. ఈ రెండు ఎలిమెంట్స్ చాలు, టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి. ప్రేక్షకుల అంచనాల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు టీజర్.

చిరంజీవి లుక్, గ్రాఫిక్స్, యాక్షన్ ఎలిమెంట్స్, భారీతనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గెటప్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ లో ఎక్కడా తగ్గకుండా, ఓ పవర్ ప్యాక్డ్ మూవీగా సైరా తెరకెక్కిందనడానికి నిదర్శనం ఈ టీజర్. చిరంజీవి చెప్పిన డైలాగ్, పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ టీజర్ లో మేజర్ హైలెట్స్.

సాధారణంగా టీజర్ లో హీరోకు మాత్రమే ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ సైరా టీజర్ లో మాత్రం కీలక పాత్రలన్నింటినీ ఒకేసారి పరిచయం చేశారు. చిరంజీవితో పాటు బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్న పాత్రలన్నింటినీ చూపించారు.

టీజర్ లో రత్నవేలు సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్. తన వర్క్ తో నేషనల్ అవార్డు అందుకున్న కమల్ కన్నన్.. సైరాకు వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వర్క్ చేశాడు. టీజర్ లో గ్రాఫిక్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి.