రికార్డుల మోత మోగిస్తున్న సైరా టీజర్

Wednesday,August 22,2018 - 01:11 by Z_CLU

రిలీజైన మరుక్షణం నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది సైరా టీజర్. విడుదలైన గంటకే మిలియన్ వ్యూస్ సాధించిన ఈ టీజర్, తాజాగా మరో చెక్కుచెదరని రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా టీజర్ కు 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రాలేదు.

24 గంటలు గడిచినా సైరా టీజర్ కు వ్యూస్, లైకులు ఏమాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఈరోజు చిరంజీవి పుట్టినరోజు కావడంతో.. టీజర్ ను మరోసారి టాప్ ట్రెండింగ్స్ లో నిలిపారు అభిమానులు. ఇది పక్కనపెడితే, టీజర్ లో చిరు లుక్స్ అందర్నీ ఆకట్టుకోవడం, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉండడం కూడా ఈ టీజర్ క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సైరా సినిమాలో తమన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ ను చిరంజీవి పోషిస్తున్నాడు. మరో 24 గంటలు గడిస్తే, ఈ టీజర్ మరో సరికొత్త రికార్డు సృష్టించడం గ్యారెంటీ.