అల్లు అర్జున్-విక్రమ్ కుమార్ సినిమా ఫిక్స్?

Tuesday,August 21,2018 - 03:10 by Z_CLU

సస్పెన్స్ కు తెరపడింది. బన్నీ నెక్ట్స్ మూవీ లాక్ అయింది. దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్ త్వరలోనే ఈ మూవీని అపీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. బన్నీ మాటల్లోనే చెప్పాలంటే మరో వారం రోజుల్లో ప్రకటన ఉండొచ్చు

దాదాపు 2 నెలలుగా బన్నీ-విక్రమ్ కుమార్ మధ్య చర్చలు సాగుతున్నాయి. ఆ స్టోరీ డిస్కషన్లు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. తన ఫైనల్ వెర్షన్ తో బన్నీని మెప్పించగలిగాడు విక్రమ్ కుమార్. ఇంతకుముందు మనం, 24 లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన విక్రమ్ కుమార్.. ఈసారి బన్నీతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రాబోతోంది ఈ మూవీ.

నా పేరు సూర్య తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. కథా చర్చలు కొలిక్కి రాకపోవడం వల్లనే సినిమా ప్రకటన లేట్ అవుతోందంటూ ఇప్పటికే ట్వీట్ చేసిన బన్నీ, త్వరలోనే ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించబోతున్నాడు.