వీకెండ్ రిలీజెస్

Tuesday,August 21,2018 - 11:31 by Z_CLU

లాస్ట్ వీక్ గీతగోవిందం విడుదలైంది. బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు దానికి పోటీగా ఈ వారం ఏకంగా 4 సినిమాలు థియేటర్ల ముందు క్యూ కట్టాయి. ఆ మూవీ డీటెయిల్స్ మీకోసం

నీవెవరో
ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమాను కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి నిర్మించారు. టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను కూడా గ్రాండ్ గా చేశారు.

ఆటగాళ్లు
నారా రోహిత్, జగపతి బాబు హీరోలుగా నటించిన డిఫరెంట్ మూవీ ఇది. పరుచూరి మురళి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో దర్శన బానిక్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. కంప్లీట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు.

అంతకుమించి
జై, రష్మి హీరోహీరోయిన్లుగా నటించిన హారర్- సస్పెన్స్ థ్రిల్లర్ అంతకుమించి. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా అందర్నీ ఉత్కంఠను గురిచేస్తుందని అంటున్నారు మేకర్స్. జానీ ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహించాడు.

లక్ష్మి
ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన మరో డాన్స్ బేస్డ్ సినిమా లక్ష్మి. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్-1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమౌతోంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమా లో దిత్య గురువుగా ప్రభుదేవా కనిపిస్తాడు. ఐశ్వర్య ఇందులో హీరోయిన్ గా నటించింది