వచ్చే నెల నుంచి సైరా రెగ్యులర్ షూటింగ్

Friday,September 22,2017 - 11:27 by Z_CLU

చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ ఈ దసరా నుంచి ప్రారంభమౌతుందని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వచ్చే నెల చివరి వారం నుంచి పట్టాలపైకి వస్తుందట. ఈ నెల రోజుల గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి, సెట్స్ నిర్మాణాల్ని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తోంది యూనిట్.

సైరా నరసింహారెడ్డి విషయంలో ఎలాంటి షరతులు, డెట్ లైన్స్ పెట్టుకోవడం లేదు యూనిట్. కేవలం క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చేలా సినిమాను రూపొందించాలనే ఉద్దేశంతో.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో సైరాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

ఈ నెల రోజుల గ్యాప్ లో రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం కూడా ఓ కొలిక్కి వస్తుంది. అప్పుడు సైరా సినిమాపై నిర్మాతగా మరింత ఫోకస్ పెట్టడానికి చెర్రీకి టైమ్ దొరుకుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. సెకెండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకున్నారు.