ఆక్సిజన్ కు మరో రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,September 22,2017 - 11:35 by Z_CLU

గోపీచంద్ హీరోగా నటించిన సినిమా ఆక్సిజన్. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. తాజాగా ఓ డేట్ ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పుడు తేదీ నుంచి ఆక్సిజన్ తప్పుకుంది. ఇప్పుడు మరో తేదీని ప్రకటించారు.

లెక్కప్రకారం.. వచ్చేనెల 12న ఆక్సిజన్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే కొన్నికారణాల వల్ల విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆక్సిజన్ మూవీని వచ్చేనెల 27న విడుదల చేయాలని అనుకుంటున్నారట.

గోపీచంద్ సరసన రాశిఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకుడు. శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు.