చిరు ఫిక్స్ అవ్వలేదు...

Tuesday,January 03,2017 - 09:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ సంక్రాంతి కి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న చిరు… తన నెక్స్ట్ సినిమాను ఏ డైరెక్టర్ తో చేస్తాడా? అనే ప్రశ్న ప్రెజెంట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రతిష్టాత్మక 150వ సినిమాకు వినాయక్ కి ఛాన్స్ ఇచ్చిన చిరు… 151 వ సినిమాకి ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నాడు? అనేది ప్రెజెంట్ టాలీవుడ్ లో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

  మొన్నటివరకూ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చిరు నటిస్తాడనే వార్త వినిపించగా… లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పుడే ఉండదనే టాక్ వినిపిస్తుంది. చిరు నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో బోయపాటి తో పాటు…. సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్ ఉండగా.. చిరు మాత్రం తన 151వ ప్రాజెక్టుకు ఇంకా ఏ దర్శకుడిని ఫిక్స్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రెజెంట్ ‘ఖైదీ నంబర్ 150’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న మెగాస్టార్… ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు రిలాక్స్ అవ్వాలను కుంటున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని అప్పుడు 151వ సినిమా దర్శకుడు ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.