151వ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్

Friday,January 13,2017 - 01:55 by Z_CLU

మెగాస్టార్ 150వ సినిమా హంగామా కొనసాగుతోంది. ఈ గ్యాప్ లో 151వ సినిమాపై చర్చ కూడా నడుస్తోంది. చిరంజీవి నెక్ట్స్ మూవీని ఎవరు డైరక్ట్ చేస్తారనే డిస్కషన్ జోరుగా నడుస్తోంది. సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే చిరు 151వ సినిమాపై మాత్రం సస్పెన్స్ అలానే కొనసాాగుతోంది. తాజాాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ సస్పెన్స్ ను కొనసాగించారే తప్ప క్లారిటీ ఇవ్వలేదు.

chiranjeevi-allu-aravind

“మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించే 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి ద‌ర్శ‌కుడిగా అనుకున్నాం. కానీ బోయ‌పాటితో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతోంది. క‌థ సుమారుగా సిద్ధ‌మైంది. ఇంత పెద్ద హిట్ త‌ర్వాత భ‌యం వేసింది. జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకే నేను వేచి చూస్తున్నా. ఆర్నెళ్ల‌పాటు బాగా వ‌చ్చాకే చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌. ఈలోగానే చ‌ర‌ణ్ వేరొక సినిమా చిరంజీవితో చేస్తారు. అయితే 151వ సినిమా డైరెక్ట‌ర్‌గా సురేంద‌ర్‌రెడ్డి పేరు వినిపించ‌డం స‌హ‌జం. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి కూడా ఎంపిక చేసిన‌ క‌థ‌ల‌తో పాటు ప‌రిశీలన‌లో ఉంది”. .. అని బాస్ 151వ సినిమా గురించి అర‌వింద్ వివ‌ర‌ణ ఇచ్చారు.