రంగస్థలం సినిమాలో సర్ ప్రైజ్ సాంగ్

Thursday,March 15,2018 - 03:15 by Z_CLU

రామ్ చరణ్ రంగస్థలం జ్యూక్ బాక్స్ ఈ రోజే రిలీజయింది. సినిమాలోని మొదటి 3 సాంగ్స్ ఒకదాని తరవాత ఒకటి రిలీజ్ చేసి సినిమాపై అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయిన సినిమా యూనిట్, ఈ రోజు మరో 2 పాటలతో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ మాట్లాడుతూ ఈ  సినిమాలో మరో సర్ ప్రైజింగ్ సాంగ్ ఉండబోతుందని రివీల్ చేశాడు.

చంద్రబోస్ పాడిన ఈ సాంగ్ సినిమాలో కథానుసారంగా ఉండబోతుందని, ఆ సాంగ్ ని సినిమాలో చూసి ఎంజాయ్  చేయాల్సిందే అన్నాడు సుకుమార్. ఈ నెల వైజాగ్ లో గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ జరుపుకోనుంది సినిమా యూనిట్.

రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేయనుంది. DSP మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.