త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ ఎంత తగ్గాడో తెలుసా?

Thursday,March 15,2018 - 01:10 by Z_CLU

ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫారిన్ సెలబ్రిటీ ట్రయిలర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కొన్ని నెలల్లోనే సరికొత్త మేకోవర్ లోకి వచ్చేశాడు యంగ్ టైగర్. అయితే ఇప్పుడీ మేకోవర్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఎన్టీఆర్ బరువుకు సంబంధించిన మేటర్ ఇది.

అవును.. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ అచ్చంగా 12 కిలోల బరువు తగ్గాడు. న్యూ లుక్ తో వచ్చే నెల నుంచి త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. నిజానికి త్రివిక్రమ్ సినిమా కోసమే తగ్గాలని అనుకోలేదు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ టైమ్ లోనే కాస్త బరువు పెరిగిన విషయాన్ని గుర్తించాడు. తగ్గాలని వ్యక్తిగతంగానే నిర్ణయించుకున్నాడు. అది త్రివిక్రమ్ సినిమాకు కలిసొచ్చింది.

ఇదే ఫిజిక్ ను నెక్ట్స్ చేయబోయే రాజమౌళి సినిమాకు కూడా కొనసాగించాలనుకుంటున్నాడు యంగ్ టైగర్. మొత్తమ్మీద రాబోయే సినిమాల్లో సరికొత్త ఎన్టీఆర్ ను చూడబోతున్నామన్నమాట.