C/O కంచెరపాలెం - ఇది పక్కా మాస్

Monday,September 03,2018 - 01:34 by Z_CLU

సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా రిలీజవుతుంది C/O కంచెరపాలెం. ఇప్పటికే ఇండస్ట్రీ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడంతో ఓవరాల్ గా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ ఉంది. నిజాయితీగా తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు సురేష్ బాబు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకున్నారు. అవి మీకోసం… 

వెదుక్కుంటూ వచ్చారు…

ప్రవీణ, మహా వెదుక్కుంటూ వచ్చి సినిమా చూడమని చెప్పారు. అప్పుడు చూసాను సినిమాని. చూడగానే నచ్చేసింది. కానీ ఈ సినిమాని ప్రమోట్ చేయడం చాల కష్టమని ఆ రోజే అర్థమయిపోయింది.

అది విజయ ప్రవీణ…

విజయ ప్రవీణ U.S. లో డాక్టర్. తెలుగు సినిమా తనకు చాలా ఇష్టం. వాళ్ళింట్లో వాళ్ళ అమ్మా నాన్న తెలుగు సినిమా వచ్చినప్పుడే గొడవ పడకుండా ఉండేవారట… అలా తెలుగు సినిమాకి కనెక్ట్ అయిన అమ్మాయి, డాక్టరయి డబ్బు సంపాదించి ఆ డబ్బులతో ఈ సినిమా నిర్మించింది.

ఇక వెంకటేష్ మహా…

సురేష్ ప్రొడక్షన్స్ లో సెట్ బాయ్ గా కరియర్ బిగిన్ చేసిన కుర్రాడు… ఎలాగైనా సినిమా తీయాలని ఫిక్సయి ఒక టీజర్ రెడీ చేసుకున్నాడు.

మేము రిక్వెస్ట్ చేయలేదు…

మేము ఎవరినీ వచ్చి సినిమా చూడమని ప్రత్యేకంగా చెప్పలేదు. చందూ మొండేటి ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయి కీరవాణి గారికి చెప్పడం, ఆయన రాజమౌళి కి చెప్పడం, ఆ తరవాత వరసగా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ ఈ సినిమాను చూడటం జరిగింది. అప్రీషియేట్ చేయడం జరిగింది.

అందరి వల్లా కాదు…

మంచి సినిమా తీయాలని అందరికీ ఉంటుంది. కానీ తీయలేరు. ఎందుకంటే కమర్షియల్ గా చూసుకోవాలి… ఇంకా చాలా ఉంటాయి ఫిలిమ్ మేకింగ్ అంటే… కానీ వీళ్ళు తీశారు…

నిజాయితీ ఉంది కాబట్టే…

ఈ సినిమాలో నిజాయితీ ఉంది కాబట్టే మీడియా కూడా ఇంతలా సపోర్ట్ చేసి ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. మేము కూడా ఈ సినిమాని స్లో గానే మూవ్ చేస్తున్నాం.

ఇదంతా మౌత్ పబ్లిసిటీ కోసమే…

సినిమా రిలీజ్ కి ముందే మీడియాకి, సినిమా వాళ్లకు చూపించడంలో ఉద్దేశం ఏమిటంటే మౌత్ పబ్లిసిటీ… గతంలో సినిమా రిలీజైన వారం రోజులకు చిన్న సినిమా జనాల్లో రిజిస్టర్ అయ్యేది. అపుడు థియేటర్స్ కి వచ్చి జనాలు  చూస్తున్నారు., ఇప్పుడు ఆ అవకాశం లేదు.  మహా అయితే వన్ వీక్, 2 వీక్స్ లో సినిమా ఆడేయాలి.. అలా జరగాలంటే మౌత్ పబ్లిసిటీ స్పీడ్ గా జరగాలి.. అందుకే సినిమా రిలీజ్ కి ముందే కొందరికి చూపించేశాం…

ఇది పక్కా కమర్షియల్ సినిమా…

‘C/O కంచెరపాలెం’ ఆర్ట్ మూవీ కాదు, పక్కా కమర్షియల్ సినిమా. సినిమాలో లవ్ స్టోరీస్ ఉంటాయి. సినిమా మొత్తంలో మ్యూజిక్ ఉంటుంది. కామెడీ ఉంటుంది. కమర్షియల్ సినిమాకి కావాల్సినవన్నీ ఈ సినిమాలో ఉంటాయి…

నాకు ‘రాజు’ అంటే చాలా ఇష్టం…

సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ లో ‘రాజు’ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సినిమాలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. రిలేట్ అయ్యేలా న్యాచురల్ గా ఉంటుంది. రాజు అనే క్యారెక్టర్ లైఫ్ లో ఎన్నో ఫేస్ చేసి కూడా, చాలా హ్యాప్పీగా ఉంటాడు.. అందుకే నాకు ‘రాజు’ నచ్చేశాడు.

 

వందల సిచ్యువేషన్స్…

సినిమాలో వందల సిచ్యువేషన్స్ ఉంటాయి… ప్రతి సిచ్యువేషన్ కి ఒక అందం. వినాయకుడి ప్రతిమ చేసే వ్యక్తి ఒక క్యారెక్టర్ అయితే, అతని భార్య.. వాళ్ళతో కొన్ని సిచ్యువేషన్స్, ఆ షాప్ ఓనర్ కి  ఒక క్యారెక్టర్.. అతనికి ఒక ఫ్యామిలీ.. మళ్ళీ వాళ్లకు రిలేటెడ్ ఇంకో క్యారెక్టర్.. ఇలా ప్రతీది కనెక్ట్ అయి ఉంటుంది ఈ సినిమా కథ..

తప్పకుండా చేస్తా…

ఇలాంటి కథతో ఎవరు వచ్చినా నేను సినిమా చేసేస్తా.. కాకపోతే వాళ్ళు ఏదైతే నాకు న్యారేట్ చేస్తారో అది వాళ్ళు  ఎగ్జిక్యూట్ చేయలేరేమో అనిపించినప్పుడు మాత్రమే నేను ఆలోచిస్తానేమో కానీ, లేకపోతే తప్పకుండా చేస్తా…

‘పటాస్’ విషయంలో జరిగింది..

నిజానికి అనిల్ రావిపూడి ‘పటాస్’ రానా కోసం రాసుకోవడం జరిగింది. నేను కూడా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ రానా బా’హుబలి’ తో బిజీగా ఉండేసరికి ఆ స్క్రిప్ట్ వదులుకోవడం జరిగింది.