సురేష్ బాబు ఇంటర్వ్యూ

Monday,December 09,2019 - 04:52 by Z_CLU

‘వెంకీమామ’ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో ఎంత డిమాండ్ ఉన్నా, కరెక్ట్ కథ దొరికేంత వరకు ఏ మాత్రం తొందరపడలేదు నిర్మాత సురేష్ బాబు. చాన్నాళ్ళ తరవాత అన్నీ ఎలిమెంట్స్ ఉన్న పర్ఫెక్ట్ తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుందని చెప్పుకున్నాడు సురేష్ బాబు.

ఇదీ జరిగిన కథ…

జనార్ధన మహర్షి నాకీ కథ చెప్పాడు. కథ విన్న తరవాత నాకీ ఐడియా నచ్చింది. కానీ ఈ కథపై చాలా పని చేయాల్సి ఉందనిపించింది. అప్పుడు కోన వెంకట్ కి చెప్పి.. ఒకసారి ఐడియా విను. ఏమైనా డెవెలప్ చేయగలమా..? చూడు.. అంటే తను పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఐడియా చాలా బావుంది. ఖచ్చితంగా దీన్ని ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు అన్నాడు.

ఏదైనా బంగార్రాజు తర్వాతే…

ఎవరైతే బావుంటుందా..? అనుకుంటూ కళ్యాణ్ కృష్ణ తో మాట్లాడా… అప్పట్లో తను ‘బంగార్రాజు’ అయితే కానీ ఇంకో సినిమా చేసేలా లేడు.. అలా కళ్యాణ్ కృష్ణ కూడా ఈ సినిమా చేయలేకపోయాడు.

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి…

కోన వెంకట్ బాబీని రిఫర్ చేశాడు. తను ఐడియా విన్న తరవాత ఫస్టాఫ్, సెకండాఫ్ ని కనెక్టింగ్ సీక్వెన్సెస్ తో ప్లాన్ చేసుకున్నాడు. అయితే నాకు వాటిలో అన్నింటి కన్నా నచ్చేసిన ఎలిమెంట్ సినిమా బిగినింగ్ లో వచ్చే సీక్వెన్స్.. వీడు నా అక్క కొడుకు.. వీడు నా బాధ్యత అని హీరో అనుకునే సీక్వెన్స్ వింటే.. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

వెంకీమామ గురించి..

ఒక సాలిడ్ స్టోరీ.. చాలా రోజుల తరవాత ఫుల్ ఫ్లెజ్డ్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. గుడ్ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్.. యాక్షన్, వ్యాల్యూస్.. ఫీలింగ్స్… ఒకసారి సినిమా చూశాక వాటిలో కొన్ని మన రియల్ లైఫ్ లో కూడా అలా ఉండాలనిపిస్తుంది. ఫాలో చేయాలనిపిస్తుంది.

సంక్రాంతి అని నేనెపుడూ అనుకోలేదు…

నేను సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడూ ఇంతగా కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఈ సినిమా విషయంలో అయ్యా. సినిమా సంక్రాంతికి వస్తుందనేది జస్ట్ పుకారు మాత్రమే. అసలు సంక్రాంతి మా ఆలోచనలోనే లేదు. సినిమా మొత్తం రెడీ అయ్యాక ఈ డేట్ ఫిక్సయ్యాం.

హీరోలు మారతారు…

ఉన్న కొద్ది మంది హీరోలు ఒకే ఇమేజ్ కి ఫిక్సయిపోయి ఏడాదికి ఒకటీ, అర కన్నా సినిమాలు చేయట్లేదు. బాలీవుడ్ లో అలా కాదు. అక్షయ్ కుమార్ సినిమాలు ఎంత డిఫెరెంట్ గా ఉంటాయి…? ఎక్కడా ఇమేజ్ కి భయపడడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంటాడు. తెలుగు హీరోలు కూడా మారతారు. ఆ టైమ్ తప్పకుండా వస్తుంది.

చైతుకి ఇలాంటి రోల్ ఇదే ఫస్ట్ టైమ్…

చాలామందిలో వెంకీ ముందు చైతు క్యారెక్టర్ ఏమైనా తగ్గిపోతుందేమో అనే అనుమానం ఉంది. కానీ అస్సలు కాదు. చైతు కరియర్ లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. చైతుకి ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది.. యాక్షన్, రొమాన్స్, కామెడీ.. అన్ని రకాలుగా చైతును ఎలివేట్ చేసిన క్యారెక్టర్ ఇది…

ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు…

సినిమాలో కథలో నాగ్ కానీ సమంతా కానీ ఎవరూ ఇన్వాల్వ్ కాలేదు. కేవలం వెంకీ, చైతు బాబీ అండ్ బాబీ టీమ్…