సునీల్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,September 03,2018 - 04:45 by Z_CLU

భీమినేని శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సిల్లీఫెలోస్’ సినిమా ఈ నెల 7 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా సునీల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూనే, తన ఫ్యూచర్ సినిమాల గురించి ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు. అవి మీకోసం…

కామెడీ జోనర్ సినిమా

‘సిల్లీ ఫెలోస్’ సినిమా కంప్లీట్ కామెడీ జోనర్ సినిమా. ఇందులో లాజిక్స్ కన్నా ఫన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ తో పాటు చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా.

20 నిమిషాలు హైలెట్…

సినిమాలో ప్రతి సన్నివేశం లో హ్యూమర్ ఉంటుంది. దాంతో పాటు సెకండాఫ్ లో జయ ప్రకాష్ రెడ్డి గారి కాంబినేషన్ లో ఉండే ఎపిసోడ్ కి అందరూ పడిపడి నవ్వుతారు ఇది మాత్రం గ్యారంటీ.

నాకు నో లవ్ స్టోరీ…

సినిమాలో నా క్యారెక్టర్ చుట్టూ ఫన్నీ సిచ్యువేషన్స్, కామెడీ ఉంటుంది. కానీ లవ్ స్టోరీ ఉండదు. నరేష్ కి లవ్ స్టోరీ ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్ లో చాలా కామెడీ సీన్స్ ఉంటాయి.

ఆఖరి అరగంట…

ఇది తమిళ రీమేకే అయినా లాస్ట్ అరగంట మాత్రం కంప్లీట్ గా మార్చేశారు. అది రీమేక్ కాదు.

స్పూఫ్ ఉండదు…

ట్రైలర్ ని బట్టి సినిమాలో బాహుబలి స్పూఫ్ ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఎక్కడా స్పూఫ్ ఉండదు. కంప్లీట్ గా స్టోరీ రిలేటెడ్ కామెడీ ఉంటుంది.

సంస్కారాన్ని బట్టే ఏదైనా…

రిసీవింగ్.. రెస్పెక్ట్ అనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. పొజిషన్స్ ని బట్టి కాదు…

కమిట్ మెంట్ ని బట్టి…

‘అందాలరాముడు’ సక్సెస్ తరవాత వరసగా హీరో అవకాశాలు రావడంతో ఒక్కసారిగా కొందరికి కమిట్ మెంట్స్ ఇచ్చాను. అవి బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేశాను. ఇక హీరోగా చేసేటప్పుడు కమెడియన్ గా చేయనా..? అంటే నాకు అవకాశాలు రాలేదు కాబట్టి చేయలేదు… కామెడీ చేయడం నా ఒరిజినాలిటీ.

సాయి పల్లవికి బావ…

‘పడిపడి లేచే మనసు’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నా… సాయి పల్లవికి బావలా కనిపిస్తా ఈ సినిమాలో. తనను పెళ్ళి చేసుకోవడానికే ఇండియాకి వస్తాను.

వాళ్ళే డైరెక్టర్స్…

ఒకప్పుడు నేను ఎంకరేజ్ చేసిన కుర్రాళ్ళే ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు కాబట్టి నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో సెట్ లో అంత రెస్పెక్ట్ ఉంటుంది.

అలా జరిగింది…

భీమనేని గారు, భరత్ చౌదరిగారు, రెడ్డి గారు ఫస్ట్ అడిగారు. వివేక్ గారు కూడా నా ముందు నుండే తెలుసు. సినిమా మొత్త నరేష్ తో పాటు ఉండే క్యారెక్టర్ నాది ఈ సినిమాలో.

అప్పుడే చేస్తా…

పూల రంగడు, అందాలరాముడు లా నాకు సూట్ అయ్యే స్టోరీస్ వస్తే హీరోగా చేస్తా… ఇది మాత్రం కంటిన్యూ చేస్తా…

క్యారెక్టర్ ని బట్టి ఎక్స్ ప్రెషన్…

కొన్ని సినిమాల్లో నా ఎక్స్ ప్రెషన్ అతిగా అనిపిస్తుంది. అక్కడా క్యారెక్టర్,  డైరెక్టర్ డైమాండ్ చేస్తేనే అలా చేస్తా… మన్మధుడు, జై చిరంజీవ, రెడీ, ఢీ సినిమాల్లో అతిగా అనిపించదు… ఏదైనా క్యారెక్టర్ ని బట్టే ఉంటుంది…

చాలా హ్యాప్పీ…

కరియర్ లో చాలా హ్యాప్పీగా ఉన్నాను. ఏదైతే చేద్దామని అనుకున్నానో అదే చేస్తున్నాను. ఈ జాబ్ పద్దతిగా, పర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే అదే చాలు…

దుమ్ము దులపాలి…

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు కొన్ని కథలు రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటి దుమ్ము దులపాలి. డైరెక్షన్ చేయాలని ఉంది. కానీ ఎప్పుడు చేస్తానో తెలీదు. రూల్సేమీ లేవు…

నా అప్ కమింగ్ మూవీస్…

అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంథోని, పడి పడి లేచే మనసు, శ్రీకాంత్ గారి ఆపరేషన్ దుర్యోధన 2019, సముద్ర గారు కొత్త కుర్రాళ్ళతో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు . అందులో కూడా మంచి క్యారెక్టర్ ఇన్స్ పెక్టర్ లా చేస్తున్నా…

అందరూ అడిగారు…

ఓవర్ సీక్ కి వెళ్ళినా.. ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ కమెడియన్ గా నన్ను మిస్సవుతున్నామనే అంటున్నారు. దానికి తోడు మరో 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కమెడియన్ గానే ఇష్టపడుతున్నారు.

కమెడియన్ గా ఫ్రీడమ్ ఉంటుంది…

హీరోగా కన్నా కమెడియన్ గానే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. హీరోగా చేస్తే కామెడీ తక్కువగా ఉంటుంది. తక్కిన అన్ని ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

అరవింద సమేతలో…

అరవింద సమేతలో మంచి క్యారెక్టర్ చేస్తున్నా…. చాలా నిజాయితీగా, న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్.

నాక్కావాల్సిందే…

నేను భీమవరం నుండి బస్సెక్కి హైదరాబాద్ కి వచ్చింది యాక్టర్ ని అవ్వడానికి. అలాంటప్పుడు సోషల్ మీడియాలో నాకు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. నాక్కావాల్సింది ఏమైనా ఉంటే తెలుసుకుంటాను తప్ప సోషల్ మీడియాని పెద్దగా పట్టించుకోను…

ఇదీ వరస..

త్రివిక్రమ్ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇక నేను చేసిన క్లాసిక్ అంటే అది ‘మర్యాద రామన్న’. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘తడాఖా’ చాలా ఇష్టం. ఇక పరుచూరి మురళి డైరెక్షన్ లో చేసిన 2 సినిమాలు కూడా అవార్డ్స్ తెచ్చాయి. ఇక అందాల రాముడు నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నాకు మాతృ సంస్థ లాంటిది.

నో టెన్షన్…

నాది కామెడీ క్యారెక్టర్ కాబట్టి సక్సెస్, ఫెయిల్యూర్స్ తో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి నో టెన్షన్.

అమర్ అక్బర్ ఆంథోని లో…

ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముగ్గురితోను ట్రావెల్ అవుతుంది.