రానా చేయాల్సిన సినిమా కళ్యాణ్ రామ్ చేతికి...

Tuesday,September 04,2018 - 02:03 by Z_CLU

‘కళ్యాణ్ రామ్ ‘పటాస్’ నిజానికి రానా చేయాల్సిన సినిమా. అనిల్ రావిపూడి ఆ కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.’ ఈ మాట ఎవరో కాదు స్వయంగా సురేష్ బాబు చెప్పారు. ప్రస్తుతం C/O కంచెరపాలెం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సురేష్ బాబు, ఈ విషయం రివీల్ చేశారు.

నిజాయితీగా సినిమా తీసే ఉద్దేశంతో తన దగ్గరికి వస్తే డెఫ్ఫినేట్ గా ఎంకరేజ్ చేస్తానని చెప్పిన సురేష్ బాబు, ఇప్పటి వరకు తన దగ్గరికి వచ్చిన ఏ మంచి కథని వదులుకోలేదని, నిజానికి అనిల్ రావిపూడి ‘పటాస్’ కథతో ముందు తన దగ్గరికే వచ్చాడని కూడా చెప్పుకున్నాడు.

నిజానికి ఆ సినిమాలో రానా హీరోగా నటించాల్సింది కాకపోతే రానా ఆ టైమ్ లో ‘బాహుబలి’ సినిమాతో బిజీగా ఉండటంతో, ఆ స్టోరీని అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు అని చెప్పుకున్నారు సురేష్ బాబు. 2015 లో రిలీజై సూపర్ హిట్టయిన ఈ సినిమా ఆ తరవాత తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు.