వీకెండ్ రిలీజెస్

Wednesday,September 05,2018 - 11:12 by Z_CLU

వరసగా 5 సినిమాలతో రెడీ అయింది ఈ వీకెండ్ టాలీవుడ్ బాక్సాఫీస్. మరీ పెద్ద స్టార్ సినిమాలు లేకపోయినా, ప్రమోషన్స్ తో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసుకున్న సినిమాలు, వాటి వాటి రేంజ్ లో ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

C/O కంచెరపాలెం: కంచెరపాలెం బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా చూసిన టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో పాజిటివ్ గా పోస్ట్ చేయడంతో కామన్ ఆడియెన్స్ కాన్సంట్రేషన్ ఈ సినిమాపై ఫిక్సయి ఉంది. వెంకటేష్ మహా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

సిల్లీఫెలోస్ :  సునీల్, అల్లరి నరేష్ నటించిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘సిల్లీ ఫెలోస్’ అల్లరి నరేష్ లాంగ్ గ్యాప్ తరవాత రిలీజవుతున్న సినిమా కావడం, దానికి తోడు ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా మెస్మరైజ్ చేసిన సునీల్, ఈ సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేయడంతో, కామెడీ అన్ లిమిటెడ్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ ఫ్రైడే రిలీజవుతున్న ఈ సినిమా ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో రీచ్ అవుతుందో చూడాలి.

మను :  రాజా గౌతమ్, చాందిని చౌదరి జంటగా నటించిన మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ మను. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై రిలీజవుతున్న ఈ సినిమా ఫణీంద్ర నార్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా తెరకెక్కిన ‘మను’ ఎంత మందికి కనెక్ట్ అవుతుందో ఈ ఫ్రైడే తెలిసిపోతుంది.

 

సూపర్ స్కెచ్ : మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా సూపర్ స్కెచ్. ఒక పోలీసాఫీస‌ర్‌, ఒక ఫారిన్ అమ్మాయి, న‌లుగురు క్రిమిన‌ల్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. రవి చావలి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ రిలీజవుతుంది.

ప్రేమకు రెయిన్ చెక్ : ఆకెళ్ళ పెరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. అభిలాష్, ప్రియ మరియు మౌనిక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. రీసెంట్ గా ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా యూనిట్, ఈ వీకెండ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.