సమంతాని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైమ్...

Monday,September 03,2018 - 12:07 by Z_CLU

 ‘యూ టర్న్’ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుంది ఈ రోజు రిలీజైన ‘ది కర్మ థీమ్ సాంగ్”. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో సాంగ్స్ ఉండవు. అయితే ఇప్పటికే వైడ్ రేంజ్ లో రీచ్ అయిన ఈ సినిమాను రిలీజ్ కి ముందే మరింత రిజిస్టర్ అయ్యేలా ఈ సింగిల్ ని రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్.

ఒక ఫ్లై ఓవర్ దగ్గర వరసగా జరుగుతున్న ఆక్సిడెంట్స్ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్ట్ లా సమంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో తనే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటుంది. ఆ స్ట్రగుల్ టైమ్ లో తన స్ట్రెంత్ తెలియజేసేలా కంపోజ్ అయింది ఈ సింగిల్.

ఈ వీడియోలో  సమంతా ఆటిట్యూడ్ పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవుతుంది. ఇంత ఇంటెన్సివ్ రోల్ లో సమంతాని చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాసిన ఈ సాంగ్ ని అనిరుద్ కంపోజ్ చేసి పాడాడు. ఈ వీడియోలో నటించాడు కూడా. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 13 న గ్రాండ్ గా రిలీజవుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.