సూపర్ హిట్.. బట్ లేట్ !

Saturday,July 01,2017 - 10:07 by Z_CLU

అయితే టాలీవుడ్ లో కొందరు డైరెక్టర్స్ మాత్రం లేటెస్ట్ గా సూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటినా ఇంకా నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నారు.


‘ఊపిరి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి 2016 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి చాలా నెలలు గడుస్తున్నా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి. మహేష్-వంశీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినా సెట్స్ పైకి రాలేదు. కొరటాల శివ సినిమా పూర్తయ్యాకే మహేష్ తో వంశీ సినిమా ఉంటుంది. అప్పటివరకు పైడిపల్లి ఖాళీనే.


రీసెంట్ గా ‘శతమానంభవతి’ తో గ్రాండ్ హిట్ అందుకొని నేషనల్ అవార్డు కూడా సాధించి పెట్టాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. అయితే ఆ సినిమా రిలీజై 6 నెలలు పూర్తయినా.. ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. దిల్ రాజు బ్యానర్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటికీ.. అదెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు.


లాస్ట్ ఇయర్ ‘హైపర్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా ఇంకా నెక్స్ట్ ఏంటి? అనే స్టేజ్ లోనే ఉన్నాడు. ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు వచ్చినప్పటికీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి.

లాస్ట్ ఇయర్ సంక్రాంతి రేస్ లో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా ఖాళీనే. మొన్నటి వరకు రామ్ చరణ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించే పనిలో ఉన్న ఈ డైరెక్టర్… ప్రెజెంట్ నానితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది.

‘పెళ్లి చూపులు’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతిలో కూడా ప్రస్తుతం సినిమా లేదు. రెండో సినిమాను కూడా కొత్త వాళ్ళతోనే ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తున్నప్పటికీ తరుణ్ మాత్రం నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకాస్త టైం పడుతుందంటున్నాడు.


‘మజ్ను’తో సూపర్ హిట్ సాధించి యూత్ ఫుల్ హిట్ అందుకున్న విరించి వర్మ కూడా రెండో సినిమాలాగే మూడో సినిమాకు కూడా చాలా టైం తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ ఈ డైరెక్టర్ ఓ హీరోకి కథ చెప్పినట్లు కానీ ఆ పనుల్లో ఉన్నట్లు కానీ వార్తలు వినిపించకపోవడంతో ఈ డైరెక్టర్ మూడో సినిమాతో సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పడుతుంది.


‘ఘాజీ’ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ సాధించి ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు. వరుణ్ తేజ్ తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడనే రూమర్ పై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొదటి సినిమాతో గట్టిగా సౌండ్ చేసిన సంకల్ప్.. రెండో సినిమాకు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.

లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ‘క్షణం’ సినిమాతో యంగ్ డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్టీ గా నిలిచిన రవి కాంత్ పేరెపు కూడా ఈ సినిమా రిలీజ్ అయి చాలా నెలలు గడుస్తున్నా ఇంకా రెండో సినిమాను సెట్స్ పై పెట్టలేదు. ఇటీవలే రానా తో ఈ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడనే వార్త వినిపించగా ఈ సినిమా పై అఫీషియల్ అనౌన్సమెంట్ మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. సో ఈ సూపర్ హిట్ డైరెక్టర్ రెండో సినిమాతో సెట్స్ పైకి వెళ్లేదెప్పుడో..