ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న 'పటేల్ సార్'...

Saturday,July 01,2017 - 12:05 by Z_CLU

ప్రెజెంట్ స్టైలిష్ విలన్ గా హీరో ఫాథర్ గా నటిస్తూ మెస్మరైజ్ చేస్తున్న జగపతి బాబు హీరోగా ఐయామ్ బ్యాక్ అంటూ ‘పటేల్ సార్’ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వాసు పరిమి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న పటేల్ సార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లేటెస్ట్ గా సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ తో సోషల్ మీడియా లో హంగామా చేసి వారంలో 2 .7 మిలియన్ వ్యూస్ సాధించి సినిమా పై అంచనాలు పెంచిన జగపతి బాబు లేటెస్ట్ గా ఈ ఫస్ట్ లుక్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ తో జగపతి బాబు బైక్ పై ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రెజెంట్ సోహాల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జులై లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి హీరోగా ఈ సినిమాతో జగపతి బాబు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో..చూడాలి.