శ్రద్ధా బర్త్ డే స్పెషల్.. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2

Sunday,March 03,2019 - 09:30 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సాహో నుంచి మరో మేకింగ్ వీడియో వచ్చేసింది. హీరోయిన్ శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2 పేరిట ఈ వీడియో రిలీజ్ చేశారు. మొదటి మేకింగ్ వీడియోలో ప్రభాస్ కు మాత్రమే ఎక్కువ స్పేస్ ఇచ్చిన మేకర్స్, రెండో వీడియోలో శ్రద్ధాకపూర్ ను ఎలివేట్ చేశారు. పనిలోపనిగా మరోసారి మేకింగ్ షాట్స్ చూపించారు.

సినిమా థీమ్ ను మరోసారి చాటిచెబుతూ, రెండో మేకింగ్ వీడియోలో కూడా యాక్షన్ మేకింగ్ షాట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాకు అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో వస్తోంది. ఇక ఈ నిమిషం వీడియోకు ప్రభాస్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాను, భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.