అబూదాబిలో ‘సాహో’ సెన్సేషన్

Wednesday,May 02,2018 - 04:26 by Z_CLU

ప్రభాస్ ‘సాహో’ ప్రస్తుతం ‘అబూదాబి’ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న మోస్ట్ అగ్రెసివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే 50 రోజులపాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ లో  దాదాపు 250 మందికి పైగా ఈ సినిమాకు పని చేయడం విశేషం. అందుకే బాలీవుడ్ భారీ చిత్రం ‘టైగర్ జిందా హై’ తరవాత మళ్ళీ అదే తరహా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’ గా గుర్తించింది అబూదాబి మీడియా. దాంతో అబూదాబి కాన్సంట్రేషన్ ప్రభాస్ పై మళ్ళింది.

ఈ షెడ్యూల్ లో లార్జ్ స్కేల్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తుంది  సాహో టీమ్. అవార్డు విన్నింగ్ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కేన్నీబేట్స్  ఫైట్స్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.  ఈ షెడ్యూల్ లో శ్రద్ధా కపూర్ కూడా పాల్గొంటుంది.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. శంకర్ – ఎహసాన్ – లాయ్ మ్యూజిక్ కంపోజర్స్. అబూదాబి షెడ్యూల్ తరవాత కరెక్ట్ టైమ్ చూసుకుని ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.