‘సాహో’ హీరోయిన్ కి వచ్చిన కొత్త ఆలోచన

Saturday,June 22,2019 - 10:02 by Z_CLU

సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ‘సాహో’ తరవాత ఇంకా తెలుగు సినిమాలు చేస్తుందా..? నిన్నా మొన్నటి వరకు అది క్వశ్చన్ మార్కే. కానీ రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘సాహో’ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూశాక.. ఫ్యూచర్ లో కూడా తెలుగు సినిమాల్లో నటించాలని ఫిక్సయింది శ్రద్ధా కపూర్.

‘బాహుబలి’ తరవాత ప్రభాస్ చుట్టూ క్రియేట్ అయి ఉన్న క్రేజ్ వల్లే ‘సాహో’ సినిమాకి సంతకం చేసింది శ్రద్ధా కపూర్. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చాక కూడా తెలుగు సినిమా కరియర్ పై అంతగా సీరియస్ గా లేదు. కానీ ‘సాహో’ టీజర్  శ్రద్ధా కపూర్ ని తెలుగు ఆడియెన్స్ కి దగ్గర చేసినట్టు, తెలుగు ఇండస్ట్రీకి శ్రద్ధా కపూర్ కూడా అంతే కనెక్ట్ అయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఫుల్ కాన్సంట్రేషన్ ‘సాహో’ పై ఉంది కానీ, ఇంకొన్నాళ్ళాగితే మరో టాప్ స్టార్ సరసన హీరోయిన్ గా ఫిక్సయ్యే అవకాశాలైతే బోలెడు కనిపిస్తున్నాయి. చూడాలి మరీ… ప్రభాస్ తరవాత శ్రద్ధా స్క్రీన్ చేసుకోబోయే స్టార్ హీరో ఎవరో…