బాహుబలి, సైరాలో ఒకేలా!

Thursday,August 22,2019 - 11:03 by Z_CLU

‘సైరా’ సినిమాలో ‘లక్ష్మి’ అనే క్యారెక్టర్ లో కనిపించనుంది తమన్నా. అప్పట్లో ఈ క్యారెక్టర్ లుక్స్ రివీల్ చేసినప్పుడు పెద్దగా అంచనాల్లేవ్. కానీ రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి తమన్నా పాత్రపై ఫోకస్ పెరిగింది. టీజర్ లో కనిపించిన సింగిల్ షాట్ తో.. తమన్నా క్యారెక్టర్ ఏంటనేది తెలిసిపోయింది.

‘బాహుబలి’ సినిమాలో కూడా అంతే. తమన్నా దేవసేనను ఎలాగైనా విడిపించుకురావాలనే ప్రయత్నంలోనే ఉంటుంది. అప్పటివరకు గ్లామరస్ క్వీన్ అనిపించుకున్న తమన్నా కత్తి పట్టుకుని ఫైట్ చేస్తుంటే అంతా షాక్ అయ్యారు.

ఇక ‘సైరా’ విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా తమన్నాది పవర్ ఫుల్ పాత్ర అనే విషయం టీజర్ తోనే అర్థమైంది. నరసింహా రెడ్డి అనుచరుల్లో ఒకరైన ‘లక్ష్మి’ క్యారెక్టర్ కి సినిమాలో మంచి వెయిట్ ఉంది.

‘బాహుబలి’లో అవంతిక గా మెప్పించిన మిల్కీ బ్యూటీ, ‘సైరా’ లో  ‘లక్ష్మి’ గా ఏ స్థాయిలో సమరానికి సై అంటుందో చూడాలి.