"నా పేరు సూర్య"లో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్

Wednesday,June 14,2017 - 03:45 by Z_CLU

ఈ రోజే బిగిన్ అయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య మూవీ చుట్టూ ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. నిన్నటివరకు  DJ సెట్స్ పై బిజీ బిజీగా ఉన్న బన్నీ ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా కోసం రెడీ అయిపోయాడు. ఓవైపు డీజే ప్రమోషన్స్ లో పాల్గొంటూనే, ఈ హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రెడీ అయిపోయాడు అల్లు అర్జున్.

వక్కంతం వంశీ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతూ తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం ఇప్పట్నుంచే మొదలైంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఆర్మీ కమాండర్ గా కనిపించబోతున్నాడట. ఇక మరో సీనియర్ తమిళ నటుడు శరత్ కుమార్, ఇందులో విలన్ గా నటించబోతున్నాడట.

ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని శ్రీధర్ లగడపాటి నిర్మిస్తున్నారు.