ముంబై హైవేపై సల్మాన్ ఖాన్ సైక్లింగ్

Wednesday,June 14,2017 - 01:05 by Z_CLU

సల్మాన్ ఖాన్ తన ఫేవరేట్ సైకిల్ పై ముంబై రోడ్లపై హంగామా చేశాడు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే పై సైక్లింగ్ చేసిన సల్మాన్ ఖాన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ‘బీయింగ్ హ్యూమన్ సైకిల్స్’ ని సోహెల్ ఖాన్ తో కలిసి లాంచ్ చేశాడు.

 

ప్రస్తుతం కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ‘టైగర్ జిందా హై’ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్, తన అప్ కమింగ్ మూవీ ‘ట్యూబ్ లైట్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ‘ట్యూబ్ లైట్’ లో సల్మాన్ ఖాన్ బ్రదర్ సోహెల్ ఖాన్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ కి రెడీగా ఉంది.