మరో షెడ్యూల్ పూర్తిచేసిన ప్రభాస్

Monday,January 27,2020 - 11:50 by Z_CLU

బాహుబలి, సాహో సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ ను ప్రభాస్ పూర్తిచేశాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో ఈ షెడ్యూల్ ను పూర్తిచేశారు. ప్రభాస్-పూజా హెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ పై కూడా కొన్ని సీన్లు తెరకెక్కించారు.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా నటిస్తున్నారు.

జాతీయ అవార్డ్ గ్రహీత కమల్ కన్నన్ ఈ చిత్రానికి VFX విభాగంలో పని చేస్తున్నాడు. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని అఫీషియల్ గా ప్రకటిస్తారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
సమర్పణ : గోపికృష్ణ మూవీస్ కృష్ణం రాజు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: ప్రమోద్, వంశీ
దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్