ప్రభాస్ సినిమాకు టైటిల్ అవసరం లేదు

Tuesday,February 04,2020 - 01:02 by Z_CLU

ఈ మాట అన్నదెవరో కాదు స్వయానా దిల్ రాజు…

అసలు విషయమేమిటంటే ‘96’ రీమేక్ టైటిల్ ‘జాను’ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందు దిల్ రాజు ప్రభాస్ సినిమా ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆ సినిమా టైటిల్ ని ‘జాన్’ అని ఫిక్సయి ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని ‘జాను’ గా అనౌన్స్ చేస్తే అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.

అయితే ప్రభాస్ ప్రొడ్యూసర్స్ మాత్రం ‘జాను’ టైటిల్ తో తమకేమీ అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే ప్రభాస్ సినిమా టైటిల్ మారే అవకాశాలున్నాయా..? మేకర్స్ మైండ్ లో ఏం నడుస్తుంది..? అని అడిగిన ప్రశ్నకి దిల్ రాజు చెప్పిన సమాధానమిది.

‘అది ప్రభాస్ సినిమా… ప్రభాస్ సినిమాకి ‘టైటిల్’ కూడా అవసరం లేదు. ప్రభాస్ ఉంటే చాలు…’ అని ప్రభాస్ స్థాయిని గుర్తుకు చేసుకున్నాడు. అందునా ఆ సినిమా రిలీజ్ ఇప్పట్లో లేదు కాబట్టి ఒకవేళ ‘జాన్’ అనే టైటిల్ కే ఫిక్సయినా పెద్దగా టైటిల్ క్లాష్ అయ్యే చాన్సెస్ ఉండవు’ అని చెప్పుకున్నాడు.

సో.. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాకు జాన్ టైటిల్ నే కొనసాగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.