అన్నీ అనుమానాలే...

Thursday,January 30,2020 - 10:02 by Z_CLU

సినిమా సెట్స్ పైకి రావడమే ఆలస్యం.. సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అనే ఆలోచన ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోతుంది. అందుకే మేకర్స్ కూడా కొద్దో గొప్పో రిలీజ్ కి చాన్సెస్ ఉన్న సీజన్ నో, ఫిక్స్ చేసుకుని ఉంటే ఆ డేట్ కాస్త అనౌన్స్ చేసేస్తారు. అలాంటి మోస్ట్ అవేటెడ్ లిస్టు లో ఉన్న సినిమాల రిలీజ్ డేట్స్ పై మాత్రం అనుమానాలే క్రియేట్ అవుతున్నాయి.

 

RRR: ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు మేకర్స్. ‘జూలై 30 2020’ తేదీని అపురూపంగా చూసుకుంటూ లెక్క లేసుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి. అందునా రాజమౌళి ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన తేదీని దాటేసినా దాఖలాలే లేవు. కానీ ఈసారి ఎందుకో ఈ ఆచారం బ్రేక్ అవుతుందేమో అనుమానం. ఎక్కడా అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు ఎందుకో ఈ సినిమా రిలీజ్ 2021 సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందేమోనని అనుమానం…  

జాన్ : ఓ రెండు సినిమాలకు సంవత్సరాల తరబడి స్పెండ్ చేశాడు కదా ప్రతి సినిమాకి అదే సూత్రం పాటిస్తాడా ఏం…? ప్రభాస్ సినిమా ఈ ఏడాది ఖచ్చితంగా వస్తుందని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఆ ఫిక్సింగ్ ఫిగర్ ని మార్చేస్తూ చాలా కూల్ గా సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతుందని చాలా కూల్ గా చెప్పాడు ఈ సినిమా నిర్మాత కృష్ణంరాజు. అది కూడా ఆయన పుట్టిన రోజు సంబరాల్లో…

కొరటాల – చిరంజీవి : సినిమా తరవాతచినన్ గ్యాప్ తీసుకోవడం చిరుకి ఆనవాయితీ కానీ సెట్స్ పైకి  వచ్చాక చిన్న బ్రేక్ కి కూడా చాన్స్ ఇవ్వడు మెగాస్టార్. ఆగష్టు లో సినిమా రిలీజ్ గ్యారంటీ అని లెక్కలేసుకున్నారు ఫ్యాన్స్. కానీ అనుమానమే… దసరాకి రిలీజయ్యే సూచనలే కాస్త గట్టిగా కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ – సుకుమార్ :  నిన్నా మొన్నటివరకు బన్ని అల.. తో బిజీగా ఉండేసరికి ప్రీ ప్రొడక్షన్ కి సరిపడా సమయం దొరికింది సుకుమార్ కి. అయినా ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంత ఈజీగా ప్యాకప్ చెప్పడు కాబట్టి తీరిగ్గా సినిమా సంక్రాంతికే అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. కానీ సర్ ప్రైజింగా మేకర్స్ ఈ సినిమాని ఈ ఏడాదికే రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది… అవునా…? ఎంతైనా అఫీషియల్ గా అనౌన్స్ చేసేవరకు అనుమానమే కదా.. జస్ట్ టాక్ వచ్చినంత మాత్రాన ఎలా ఫిక్సవుతాం…