డిస్కో రాజా కోసం ఫాస్ట్ అండ్ ఫురియెస్ టీం

Saturday,September 21,2019 - 12:27 by Z_CLU

మాస్ మహారాజ్ రవితేజ హీరో గా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతకం పై టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది.

తాజాగా గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది. ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో మరో కీలక షెడ్యూల్ పూర్తిచేస్తున్నారు. 5 రోజుల నుంచి జరగబోతున్న ఈ షెడ్యూల్ ని దాదాపు 4 – 5 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఐస్ ల్యాండ్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలానే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం డిస్కో రాజా కోసం రంగం లోకి దిగారు.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్ – రామ్ తళ్లూరి
సమర్పణ – సాయి రిషిక
నిర్మాత : రజిని త‌ళ్లూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్. ఎస్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి