మెగాస్టార్ 152 సెట్స్ పైకి...

Friday,December 20,2019 - 10:02 by Z_CLU

మెగాస్టార్ సినిమా 152 సెట్స్ పైకి రావడానికి సిద్ధమైంది. ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ లో ఉంది ప్రస్తుతానికి కొరటాల టీమ్. ‘సైరా’ తరవాత ఓ చిన్న గ్యాప్ తీసుకున్న మెగాస్టార్… ఈ ఏడాది లాస్ట్ వీక్ నుండే మళ్ళీ బిజీ కాబోతున్నాడు.

‘భరత్ అనే నేను’ తరవాత మళ్ళీ సినిమా చేయలేదు కొరటాల. మెగాస్టార్ ‘సైరా తో బిజీగా ఉన్నన్నాళ్ళు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టాడు. చిరు ఇమేజ్.. తన సొంత మార్క్ కాంబినేషన్ లో కాంటెంపరరి మెసేజ్ తో కథ రెడీ చేసుకున్న కొరటాల, మెగాస్టార్ ని ఈ సినిమాలో మరింత పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు.

‘సైరా’ కథకు తగ్గట్టు గ్రాండియర్ ని ఎక్స్ పీరియన్స్ చేసిన మెగా ఫ్యాన్స్.. చాలా రోజుల తరవాత మళ్ళీ మెగాస్టార్ మార్క్ కంప్లీట్ ఎంటర్ టైనర్ ని ఈ సినిమాతో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమాలో చిరు సరసన ఆల్మోస్ట్ త్రిష కన్ఫమ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో ఆ వివరాల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.