శ్రీను వైట్ల ఇంటర్వ్యూ
Tuesday,November 13,2018 - 01:42 by Z_CLU
ఓవరాల్ గా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’. డిఫెరెంట్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ అని చెప్పుకున్న శ్రీను వైట్ల, ఈ సినిమా గురించి మీడియాతో మరెన్నో విషయాలు డిస్కస్ చేశాడు అవి మీకోసం..
రిలాక్స్ గా ఉన్నా…
చాలా కాన్ఫిడెన్స్ ఉంది అమర్ అక్బర్ అంటోని పై.. అందుకే రిలాక్స్ గా ఉన్నా…
రియలైజ్ అయ్యాను…
నేను చేసిన తప్పులు రియలైజ్ అయ్యాననే అనుకుంటున్నాను. నేను నా కరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఎలా పని చేశానో అలాగే పని చేయాలి అనుకున్నాను, అంతకు మించి పని చేశాను.
ఇది మైత్రి జర్నీ…
ఈ సినిమా అనుభవాలు చెప్పాలంటే అద్భుతమైన జర్నీ. అది మైత్రి మూవీ మేకర్స్ వల్లే సాధ్యమైంది. సినిమా కంప్లీట్ గా న్యూయార్క్ లోనే తెరకెక్కించాలి, అందునా 2 సీజన్స్ లో… స్నో సీజన్ లో.. ఆ తరవాత సమ్మర్ లో… ప్రొడ్యూసర్స్ కథను అర్థం చేసుకున్నారు, సహకరించారు కాబట్టే ఈ జర్నీ అద్భుతంగా జరిగింది.ఈ ప్రయాణం అద్భుతం కాబట్టి, రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుందనే అనుకుంటున్నా…

అదే ఈ సినిమాకి బోనస్…
నా గత సినిమాలతో కంపేర్ చేస్తే అన్ని సినిమాలకు మించి ఉండబోయే కథ ఈ సినిమాకి బోనస్. రవితేజ, నా సినిమా అనగానే ఉండబోయే మ్యాజిక్ తో పాటు ఒక స్ట్రాంగ్ పాయింట్ బేస్డ్ సినిమా అమర్ అక్బర్ ఆంటోని.
రవితేజ కోసమే…
రవితేజని మైండ్ లో పెట్టుకునే ఈ కథ రెడీ చేసుకున్నాను..
వేరే ఆప్షన్ లేదు…
ముందుగా టైటిల్ అనేసుకుని ఆ తరవాత కథ రాసుకోలేదు. కథ రెడీ అయ్యాకే ఈ టైటిల్ అనుకున్నాం. ఎందుకంటే ఈ కథకి ఈ టైటిల్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
అనుకున్నా జరిగిపోయింది…
నేను ఇలియానా అయితేనే బావుంటుంది అనుకునే టైమ్ లో ఇలియానా సినిమాలు చెయ్యట్లేదు అన్నారు అందరూ.. ప్రొడ్యూసర్స్ కూడా అదే అన్నారు. అంతకు ముందు ఏదో సినిమాకు అప్రోచ్ అయితే, నో చెప్పింది అన్నారు, అంతలో వేరే ఆప్షన్ అనుకునే టైమ్ లో, ఇలియానా యస్ అనడం జరిగింది…
నాకు ఆ తేడా తెలీదు…
నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. నా ఫస్ట్ సినిమా బడ్జెట్ 38 లక్షలు. అక్కణ్ణించి సినిమాలు చేస్తూ చేస్తూ పెద్ద సినిమాలు కూడా చేశాను కానీ, నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా అసలుండదు.

నా హ్యాప్పీనెస్ కి రీజన్…
నాకు సినిమా పిచ్చి ఉంది తప్ప, కీర్తి కాంక్ష లేదు. నా జయాపజయాలను అస్సలు సీరియస్ గా తీసుకోను, సక్సెస్ లో ఉన్నప్పుడు అందరినీ చుట్టూ చేర్చుకోను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరూ లేరే అని ఫీల్ అవ్వను. నేను హ్యాప్పీగా ఉండగలగడానికి రీజన్ అదే…
అంత కాంపిటీషన్..
నా కరియర్ లో నేనెప్పుడూ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి గానీ, హీరో దగ్గరికి వెళ్ళి గాని, సినిమా చేద్దామని అడగలేదు. నేను ఫ్లాప్స్ ఇచ్చినా, 5 గురు ప్రొడ్యూసర్స్ నాతో సినిమా చేయడానికి కాంపిటీషన్ లో ఉన్నారు. వాళ్ళ లోంచి నేను మైత్రి మూవీ మేకర్స్ ని ఎంచుకున్నాను. నేను మహేష్ బాబును కూడా ఎప్పుడూ సినిమా చేద్దామని అడగలేదు. ఆయన నాకు మంచి ఫ్రెండ్. అన్ని కుదిరితే చేసేయడం తప్ప, రిక్వెస్ట్ చేసుకోవడం ఉండదు.
రవితేజ నా ట్రబుల్ షూటర్…
నేను కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు ‘వెంకీ’ చేద్దామని వచ్చాడు. ఆ తరవాత ‘ఢీ’ సినిమా అసలు బయటకు కూడా వస్తుందో రాదో అనుకుంటున్నప్పుడు, ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ నుండి సినిమా చేసేద్దాం అన్నాడు. అంత నమ్మకం నేనంటే.. నన్ను మనిషిగా కన్నా, దర్శకుడిగా నన్ను ఎక్కువగా నమ్ముతాడు రవితేజ. ఆయన అన్నట్టుగానే ‘ఢీ’ తరవాత దుబాయ్ శీను సినిమాని నెల రోజుల్లో సెట్స్ పైకి తీసుకు వచ్చేశాం.
అది చాలా కష్టం…
బ్రాండ్ క్రియేట్ అయిందంటే అదీ బాధ్యతే. శ్రీను వైట్ల సినిమా అనగానే కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసే ఆ మార్క్ ని కథలో బ్లెండ్ చేసి, కథ ఏ మాత్రం డీవియేట్ అవ్వకుండా చెప్పగలగడం అన్నది చిన్న విషయం కాదు, చాల కష్టం. ఆ కష్టాన్ని నేను బాధ్యతగా తీసుకున్నాను.

సునీల్ రోల్…
సునీల్ ఈ సినిమాలో బేబీ సిట్టర్ బాబీ లా కనిపిస్తాడు. సినిమాలో విపరీతంగా నవ్విస్తాడు. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, టైమింగ్ కానీ అదిరిపోయాయి.
రవితేజను వాడుకున్నా…
రవితేజ చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఈ సినిమాలో తనను మ్యాగ్జిమం వాడేసుకున్నా…
అలా జరిగింది…
పాప రోల్ విషయంలో U.S. లోనే పుట్టి పెరిగిన అమ్మాయయితే బావుంటుంది అనుకున్నప్పుడు లయ గారి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసింది. ఫోటోస్ చూసి పిలిచినప్పుడు, ఎలాగూ పాప మదర్ రోల్ కూడా మీరే చేయండి అని లయ గారిని అడగడం జరిగింది, ఆవిడ ఓకె అన్నారు.
మహాధన్ కుదరలేదు…
రవితేజ చైల్డ్ హుడ్ క్యారెక్టర్ కి మహాధన్ ని అనుకున్నా, వీసా రాలేదు. అందుకనే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. వేరే అబ్బాయితో చేశాం. తను కూడా రవితేజ పోలికలతో ఉంటాడు.
నేనే అల్టిమేట్..
ఇంకో కథ రెడీ చేసుకుని అది ముందు నాకు నచ్చిన తరవాతే చేస్తా…
బాలీవుడ్ సినిమా…
బాలీవుడ్ లో చేయాలనే ఆలోచన నాకు చాన్నాళ్ళుగా ఉంది. ‘ఢీ’ సినిమా టైమ్ లో కూడా శత్రుఘ్న సిన్హా గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయినా కుదరలేదు. అందుకే ఈ సినిమా కంప్లీట్ రైట్స్ నా దగ్గరే పెట్టుకున్నాను. ఇది సక్సెస్ అయితే బాలీవుడ్ లో చేసేస్తా..