రామ్ చరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ లో హీరోయిన్స్

Tuesday,November 13,2018 - 01:41 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ లాంచ్ అయింది. రాజమౌళి డైరక్షన్ లో ఈనెల 19 నుంచి సెట్స్ పైకి రాబోతోంది. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి మ్యూజిక్ డైరక్టర్. అంతా సెట్ అయింది. మరి హీరోయిన్ల పరిస్థితేంటి..?

క్రేజీ మల్టీస్టారర్ కాబట్టి క్రేజీ హీరోయిన్లు కావాలి. ప్రస్తుతం ఆ పనిమీదే ఉన్నాడు జక్కన్న. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాలో కీర్తిసురేష్, కైరా అద్వానీ హీరోయిన్లుగా నటించే ఛాన్స్ ఉంది. వీళ్లలో కీర్తిసురేష్ చెర్రీ సరసన, కైరా అద్వానీ ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా కనిపిస్తారట.

తన సినిమాలకు సంబంధించి ప్రతి నిర్ణయాన్ని స్వయంగా రాజమౌళి తీసుకుంటాడు. హీరోయిన్ల ఎనౌన్స్ మెంట్ కోసం కూడా ఈ దర్శకుడు ఏదో స్పెషల్ ప్రమోషనల్ స్కెచ్ రెడీ చేసే ఉంటాడు. ఈ ముద్దుగుమ్మలపై క్లారిటీ రావాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే