రవితేజ కొత్త సినిమాపై ఫిక్సయిన కాన్సంట్రేషన్

Monday,August 27,2018 - 07:04 by Z_CLU

రవితేజ కొత్త సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫస్ట్ లుక్ రిలీజయింది. మాస్ మహారాజ్ ఈ సినిమాలో 3 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రిలీజైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ కి  స్కోప్ క్రియేట్ చేస్తుంది.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఫ్యాన్స్ లో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ రోజు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ లుక్స్ ని, రివీల్ చేశారు ఫిలిమ్ మేకర్స్. అయితే రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా, పోస్టర్ లో హైలెట్ అవుతున్న కార్డ్స్, అందులో రవితేజ లుక్స్ ని ప్రెజెంట్ చేయడంతో, సినిమా కాన్సెప్ట్ పై ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మళ్ళింది.

అమర్ అక్బర్ ఆంటోని బ్యాక్ స్టోరీ ఏంటి..? దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాలో రవితేజని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అక్టోబర్ 5 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది.