6 ఏళ్ల గ్యాప్ తరవాత ఇలియానా...

Thursday,June 28,2018 - 12:36 by Z_CLU

రవితేజ అమర్ అక్బర్ ఆంథోని సినిమా నుండి అనూ ఇమ్మాన్యువెల్ ఇలా తప్పుకుందో ఇమ్మీడియట్ గా ఆ ప్లేస్ లో ఇలియానా పేరు వినిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ 2012 లో రిలీజైన ‘దేవుడు చేసిన మనుషులు’ తరవాత మళ్ళీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు.

టాలీవుడ్ లో ఇంతమంది హీరోయిన్స్ ఉన్నా ఫిల్మ్ మేకర్స్ ఎందుకు ఇలియానాను ప్రిఫర్ చేశారో బిగినింగ్ లో  తెలీలేదు కానీ, ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ అని ఫిల్మ్ మేకర్స్ ఇలా  అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారో లేదో, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

 

మాస్ మహారాజ రవితేజ అగ్రెసివ్ పర్ఫామెన్స్ కి ఇలియానా పర్ఫెక్ట్ జోడీ.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన  సినిమాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీనే ఫస్ట్ హైలెట్ పాయింట్ అయ్యేది. అలాంటిది ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందనగానే ఆ మ్యాజిక్ కూడా రిపీట్ అవ్వడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 3 డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు రవితేజ. అల్టిమేట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.