పని పూర్తి చేసుకున్న అమర్ అక్బర్ ఆంథోని

Monday,September 24,2018 - 07:31 by Z_CLU

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మ్యాగ్జిమం సినిమాని U.S. లో తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు అనపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ షెడ్యూల్ లో రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో సాంగ్ తెరకెక్కించారు ఫిల్మ్ మేకర్స్.

మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ 3 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మాస్ మహారాజ్ బర్త్ డే సందర్భంగా ఈ గెటప్స్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే అటు షూటింగ్, ఇటు పోస్ట్ ప్రొడక్షన్ సైమల్టేనియస్ గా జరుపుకుంటున్న సినిమా యూనిట్, రేపటి నుండి కంప్లీట్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.