నితిన్ 'శ్రీనివాస కళ్యాణం'... సందడి మొదలైంది

Sunday,July 22,2018 - 10:00 by Z_CLU

నితిన్ హీరోగా దిల్ రాజు – సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియో రిలీజ్ అయింది. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఆడియోను నిన్న సాయంత్రం  సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ బెస్ట్ ఆల్బం అనిపించుకుంటుంది.

ఇటివలే ‘కళ్యాణం వైభోగం’ సాంగ్ ,  కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా ఆడియో ఈవెంట్ జరపనున్నారు. ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. సంప్రదాయబద్దంగా జరగనున్న ఈ ఈవెంట్ కి సినిమా యూనిట్ అంతా తమ కుటుంబంతో హాజరుకానున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నందిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 9న థియేటర్స్ లోకి రానుంది.