లక్ష రూపాయిలు పంపిన సుకుమార్

Sunday,July 22,2018 - 09:35 by Z_CLU

‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. తెలిసిందే. ఈ సాంగ్ పాడిన సింగర్ వెంకటలక్ష్మి కి మాత్రం పారితోషకం అందలేదనే ఇష్యూ ఇటివలే బయటికొచ్చింది. అయితే నిర్మాతలు ఇచ్చిన డబ్బు తనకు అందజేయకుండా తనను సింగర్ గా పరిచయం చేసిన వ్యక్తి కాజేసాడని ఇటివలే మీడియాతో వాపోయింది వెంకటలక్ష్మి.

ఈ సంగతి తెలిసిన వెంటనే స్పందించాడు దర్శకుడు సుకుమార్… వెంకట లక్ష్మి గారికి పారితోషకం అందలేదన్న విషయం తెలుసుకున్న సుక్కు తన  తరుపున కచ్చితంగా డబ్బు పంపిస్తానని అనౌన్స్ చేసాడు. చెప్పిన మాటకు కట్టుబడి  లేటెస్ట్ గా  వెంకటలక్ష్మి కి  1 లక్ష రూపాయిలు పంపించి శెభాష్ అనిపించుకున్నాడు సుకుమార్.

సుకుమార్ గారు పంపిన లక్ష రూపాయలు తనకు అందాయని ఆమె స్పష్టం చేశారు.  వారికెప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. సినిమాల్లో ప్రతిభ గల తన లాంటి వారిని ఆదరించాలని.. పాడేందుకు అవకాశం ఇవ్వాలని వెంకటలక్ష్మీ ఈ సందర్భంగా కోరారు. ఇక జిగేల్ రాణి పాట హిట్ తో తనను ముగ్గురు దర్శక నిర్మాతలు సంప్రదించారని.. వారి సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంకట లక్ష్మి తెలిపారు. ఇదంతా సుకుమార్ – దేవీశ్రీ వల్లేనని ఆమె చెప్పుకొచ్చారు.