పవన్ దర్శకుడితో నితిన్ సినిమా ?

Tuesday,October 18,2022 - 02:11 by Z_CLU

ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా తర్వాత ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. తాజాగా నితిన్ కి ఓ అదిరిపోయే యాక్షన్ డ్రామా కథ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట సాగర్. దర్శకుడిగా సాగర్ కే చంద్ర ఇప్పటికీ మూడు సినిమాలు చేశాడు. ‘అయ్యారే’,’అప్పట్లో ఒకడుండేవాడు’, సినిమాలు తీసిన సాగర్ కి పవన్ కళ్యాణ్ , రానా ‘భీమ్లా నాయక్’ తో మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం సాగర్ కే చంద్ర నితిన్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నిర్మాత ఎవరు ? నితిన్ సొంత బేనర్ లోనే ఈ సినిమా ఉంటుందా ? తెలియాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో నితిన్ -సాగర్ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.