శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’ రిలీజ్ డేట్

Tuesday,September 11,2018 - 05:14 by Z_CLU

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’. చెన్నై లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సెప్టెంబర్ థర్డ్ వీక్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ప్రస్తుతం సునీల్ తో సాంగ్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్, సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ కాగానే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్ గా ఎలక్షన్స్ నేపథ్యంలో ఉండబోయే ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్ రోల్ ప్లే చేస్తున్నాడు.

కరణం బాబ్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ర్యాప్ రాక్  షకీల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో యజ్ఞ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.