సరికొత్త క్యారెక్టర్ తో మంచు మనోజ్ ?

Tuesday,February 18,2020 - 04:18 by Z_CLU

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ నెక్స్ట్ ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్ తో హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే టైటిల్ పోస్టర్ తో పాటు తన సొంత బ్యానర్ కూడా అనౌన్స్ చేసిన మనోజ్ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాదట.

మొన్నటి వరకూ లవర్ బాయ్  , మాస్ క్యారెక్టర్స్ చేసిన మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ కోసం అఘోరాలా మారనున్నాడనే టాక్ వినిపిస్తుంది. సినిమాలో మనోజ్ అఘోరా గా కనిపిస్తూ ఓ కొత్త పాయింట్ తో ఎంటర్టైన్ చేస్తాడని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతన్నది తెలియాలంటే ఈ విషయంపై మనోజ్ లేదా యూనిట్ స్పందించే వరకూ వెయిట్ చేయాల్సింది.