మంచు మనోజ్ 'అహం బ్రహ్మస్మి' ప్రారంభం !

Friday,March 06,2020 - 02:54 by Z_CLU

మంచు మనోజ్ హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అహం బ్రహ్మస్మి’ ఘనంగా ప్రారంభమైంది. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ ఇవ్వగా మోహన్ బాబు , పరుచూరి గోపాల కృష్ణ టీం కు స్క్రిప్ట్ అందించారు.

శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా మొదటి షెడ్యుల్ ఈ నెల 11 నుండి రామోజీ ఫిలిం సిటీలో మొదలు కానుంది. ప్రత్యేకంగా భారీ సెట్ లో ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నారు. మనోజ్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అచ్చు రాజమణి, రమేష్ తమిళ్ మణి సంగీతం అందిస్తున్నారు.

 

ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మలాదేవి, మంచు మనోజ్ నిర్మిస్తున్నారు.